సీఎం జగన్‌కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ.. ఏం కోరారంటే?

Sunday, August 23rd, 2020, 12:17:28 PM IST

ఏపీ సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. ప్రైవేటు విద్యాసంస్థలలో పనిచేస్తున్న టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగులకు లాక్‌డౌన్ కాలం మొత్తానికి నెలకి పది వేల చొప్పున ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, డీమ్డ్ యూనివర్సిటీలలో దాదాపు 5 లక్షల మంది టీచింగ్, నాన్-టీచింగ్ స్టాఫ్ ఉన్నారని అన్నారు. అయితే కరోనా విపత్కర కాలంలో వీరికి అసలు వేతనాలే చెల్లించలేదని ఆయన లేఖలో పేర్కొన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు, నాన్ టీచింగ్ స్టాఫ్ తమకు వేతనాలు చెల్లించాలని కోరుతూ పలు రూపాల్లో ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు.