ఏ మొహం పెట్టుకుని బీజేపీ తిరుపతిలో ఓట్లు అడుగుతుంది – సీపీఐ రామకృష్ణ

Saturday, March 13th, 2021, 08:50:10 AM IST

బీజేపీ నేతలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన పోటీ నుంచి తప్పుకుని బీజేపీని ఊబిలోకి దింపిందని అన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయడం వల్ల ప్రజా తీర్పుకు అవకాశం ఏర్పడిందని అన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఓట్లు అడగడానికి రాష్ట్ర బీజేపీ నేతలు ఏ మొహం పెట్టుకుని వస్తారని ప్రశ్నించారు.

అయితే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేస్తున్నందుకా? తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధాని మోదీ ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ నెరవేర్చనందుకా? విభజన చట్ట హామీలు అమలు చేయనందుకా? ఏపీకి కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించనందుకా? ఎందుకోసం మీకు ప్రజలు ఓటు వేయాలని నిలదీశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కదని ఆగ్రహం వ్యక్తం చేశారు.