ఈసారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అలా ఉండాలి – సీపీఐ నారాయణ

Saturday, September 5th, 2020, 12:11:07 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. రోజురోజుకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరుగుతుంది. అయితే ఈ మహమ్మారి ను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మహమ్మారి ఉన్న నేపధ్యం లో అసెంబ్లీ సమావేశాల అంశం పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే దీని పై సీపీఐ నారాయణ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈసారి జరగబోయే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కరోనా పై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ఉండాలి అని కోరారు. వాదోపవాదనలు కాకుండా, ప్రజలకు అక్కరకు వచ్చేలా సమావేశాలు జరగాలని సూచించారు. అయితే అంధ్ర ప్రదేశ్ రాష్ట్రము తో పోల్చితే తెలంగాణ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగానే ఉంది అని నారాయణ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం లో కష్టపడుతున్నారు అని, కానీ ఒక్క గాంధీ ఆసుపత్రి లో మాత్రమే కాకుండా, ఎక్కువ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని కోరారు.