సీఎం జగన్‌కి సీపీఐ నేత రామకృష్ణ లేఖ.. ఏం కోరారంటే..!

Thursday, August 20th, 2020, 12:26:54 PM IST

ఏపీ సీఎం జగన్‌కి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలోని యువతకు సీఎం జగన్ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల అవకాశం కల్పించారని మొదటి నోటిఫికేషన్‌లో సెలక్ట్ అయిన అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించినా, రెండో నోటిఫికేషన్ ఉద్యోగాలు ఇంకా భర్తీ చేయలేదని వీటిని కూడా భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అన్నారు.

అంతేకాదు హార్టీకల్చర్ విభాగం నోటిఫికేషన్‌లో ఇచ్చిన అర్హతలను సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో మార్పులు చేయడం వలన చాలా మంది ఉద్యోగాలు పొందలేకపోయారని, అలాంటి అభ్యర్థులకు వయోపరిమితి పూర్తి కావస్తుందని లేఖ ద్వారా గుర్తు చేశారు. అయితే వీరికి మొదటి నోటిఫికేషన్ ప్రకారం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.