ఏపీ సీఎం జగన్‌కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ.. ఏం కోరారంటే?

Monday, November 9th, 2020, 12:02:36 AM IST

CPI-Ramakrishna_CM-Jagan

నంద్యాలలో సలాం కుటుంబం ఈ నెల 3వ తేదిన పాణ్యం మండలం కౌలూరు వద్ద గూడ్స్‌ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే సలాం ఆత్మహత్య ఘటనపై ఇద్దరు ఐపీఎస్‌లతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. విచారణ కమిటీ సభ్యులుగా ఏపీఎస్పీ బెటాలియన్ ఐజీ శంకబ్రత బాగ్చి, గుంటూరు అదనపు ఎస్పీ ఆరీఫ్‌గా నియమించారు. విచారణ పూర్తయ్యే వరకు నంద్యాల వన్ టౌన్ సీఐ సోమశేఖర్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు చేశారు.

అయితే ఈ ఘటనపై స్పందించిన సీపీఐ నేత రామకృష్ణ ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాశారు. నంద్యాలలో సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేశారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేకే సలాం కుటుంబం ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పుకొచ్చారు. అయితే మృతదేహాలకు అర్ధరాత్రి అంత్యక్రియలు జరపడం పలు అనుమానాలకు తావిస్తుందని అన్నారు.