సీఎం జగన్‌కి సీపీఐ నేత రామకృష్ణ లేఖ.. ఏం కోరారంట?

Sunday, October 18th, 2020, 09:13:55 AM IST

ఏపీ సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మరో లేఖ రాశారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు ప్రభుత్వ ఆదాయంలో వాటా చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. అంతేకాదు 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం స్థానిక సంస్థలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మాదిరిగానే సర్వ హక్కులు కలిగి, స్థానిక ప్రభుత్వ కేంద్రాలుగా ఉండాలని అన్నారు.

అయితే రాష్ట్రంలో అత్యధిక మున్సిపాలిటీలు ప్రజల నుండి వసూలు చేసే పన్నులను సిబ్బంది జీతభత్యాలకు, నిర్వహణకు వినియోగిస్తున్నాయని, ఈ విధంగా చేయడం వలన ప్రజా సంక్షేమం, అభివృద్ధి జరగడంలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఉద్యోగుల జీతాలను చెల్లిస్తున్నట్లుగా మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల ఉద్యోగుల జీత భత్యాలను కూడా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.