వారిని ఆదుకోండి.. సీఎం జగన్‌కు సీపీఐ నేత లేఖ..!

Monday, October 12th, 2020, 08:35:29 AM IST

ఏపీ సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. వ్యవసాయ క్షేత్రాలలోకి రెవెన్యూ యంత్రాంగాన్ని పంపించి పంట నష్టాన్ని అంచనా వేయాలని, వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని సీఎం జగన్‌ను లేఖలో కోరారు. భారీ వర్షాల కారణంగా వేరు శెనగ పంట పూర్తిగా దెబ్బతిందని అన్నారు.

అయితే మరికొన్ని పంటలు కూడా నీట మునిగిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. వేలాది రూపాయలు అప్పులు తెచ్చి వేసిన పంటలు పాడైపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని చెప్పుకొచ్చారు. 2018-2019కి సంబంధించి ఇన్‌పుట్ సబ్సిడిని చెల్లించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని, రెవెన్యూ, వ్యవసాయ మంత్రులను ఆయా జిల్లాల్లో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకునేలా ఆదేశించాలని కోరారు. రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.