ఏపీ సీఎం జగన్‌కు సీపీఐ రామకృష్ణ లేఖ.. ఏం కోరారంటే?

Wednesday, October 7th, 2020, 11:43:31 AM IST

ఏపీ సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలంటూ లేఖలో పేర్కొన్నారు. వ్యవసాయిక రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో సూక్ష్మ సేద్యం ఎంతో ఉపయోగకరమని అన్నారు. అయితే 2018-19లో 5 లక్షల ఎకరాలకు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అమర్చడం ద్వారా ఏపీ దేశంలోనే 2వ స్థానంలో నిలిచిందని లేక ద్వారా గుర్తుచేశారు.

అయితే ఈ ఏడాది మార్చిలో ప్రాజెక్టు మంజూరైన రైతులకు ఇప్పటికీ పరికరాలు ఇవ్వలేదని అన్నారు. పీఎంకేఎస్‌వై నిధులు 412 కోట్లు, నాబార్డు నిధులు 616 కోట్లు కలిపి మొత్తంగా 1028 కోట్లు అందుబాటులో ఉన్నా ఆ నిధులను వినియోగించలేదని అన్నారు. అయితే రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని ఇకనైనా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు లేఖలో పేర్కొన్నారు.