వారిని ఆదుకోండి.. ఏపీ సీఎం జగన్‌కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ..!

Tuesday, September 29th, 2020, 11:37:45 AM IST

ఏపీ సీఎం జగన్‌కి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించి తీవ్ర నష్టం వాటిల్లిందని, గోదావరి, కృష్ణా నది పరివాహక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు కరోనా కారణంగా ఇప్పటికే ప్రజలు, రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదురుకుంటున్నారని అన్నారు.

అయితే ఇలాంటి సమయంలో వరదల కారణంగా రైతులు మరింత ఆర్థికంగా దెబ్బతిన్నారని ఇది వారి జీవనోపాధికి పెను ప్రమాదంగా మారిందని చెప్పుకొచ్చారు. అయితే వర్షాలు, వరదల వలన జరిగిన నష్టాన్ని తక్షణమే అంచనా వేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు రైతులను, ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ణప్తి చేశారు.