స్కూళ్ల పున:ప్రారంభంపై పునరాలోంచాలి.. సీఎం జగన్‌కి రామకృష్ణ లేఖ..!

Tuesday, August 25th, 2020, 08:30:53 AM IST

ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ సమయంలో ప్రభుత్వం పాఠశాలలను వచ్చే నెల నుంచి ప్రారంభించాలని తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు లేఖ రాశారు. ప్రతిరోజు ఏపీలో 8 వేల నుండి 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయని ఇలాంటి పరిస్థితులలో పాఠశాలలు ప్రారంభించటం సరికాదని సూచించారు.

రాష్ట్రంలో పలువురు ఉపాధ్యాయులు, సిబ్బంది కరోనా బారిన పడ్డారని, ఏపీ విద్యాశాఖ మంత్రికి కూడా కరోనా సోకిందని అన్నారు. అంతేకాదు అమెరికాలో పాఠశాలలు తెరిచిన 15 రోజులలో లక్ష మంది పిల్లలకు కరోనా సోకిన విషయాన్ని గుర్తించాలని అన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మద్యం షాపులకు అనుమతిచ్చి కరోనా వ్యాప్తికి కారణమైందని, కరోనా పూర్తిగా నివారించబడే వరకైనా లేదా వ్యాక్సిన్ వచ్చే వరకైనా పాఠశాలల పున:ప్రారంభం వాయిదా వేయడం మంచిదని లేఖలో పేర్కొన్నారు.