క్వారంటైన్‌లో సరైన వసతులు కలిపించాలి.. జగన్‌కు రామకృష్ణ లేఖ..!

Monday, July 6th, 2020, 09:18:12 AM IST

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో క్వారంటైన్ కేంద్రాలలో ఉన్న వారికి సరైన ఆహార, మెరుగైన వసతి సదుపాయాలు కల్పించాలని ఏపీ సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు.

అయితే నాణ్యమైన భోజనం, మంచినీళ్లు, మందులు లేక క్వారంటైన్ కేంద్రాలలో ఉన్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి 500 రూపాయలు ఖర్చు పెడుతున్నప్పటికి యంత్రాంగం, కాంట్రాక్టర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో మొదట్లో కరోనా టెస్టులు విస్తృతంగా జరిగినా ప్రస్తుతం మందకొడిగా సాగుతున్నాయని అన్నారు.