సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన సీపీఐ నేత రామకృష్ణ..!

Friday, October 30th, 2020, 02:03:40 AM IST


ఏపీ సీఎం జగన్‌పై సీపీఐ నేత రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆందోళనకర పరిస్థుతులు నెలకొనడానికి సీఎం జగన్ విధి విధానాలే కారణమని అన్నారు. జగన్‌కు వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమని ప్రజల గురుంచి అవసరం లేదని అన్నారు. అమరావతి రైతుల ఉద్యమాన్ని నీరు గార్చాలని ప్రభుత్వమే కుట్ర చేస్తుందని మండిపడ్డారు.

అయితే డబ్బులు ఇచ్చి 3 రాజధానులకు మద్దతుగా ప్రభుత్వమే పెయిడ్ ఉద్యమం చేయిస్తుందని ఆరోపించారు. జగన్ పిచ్చి పరాకాష్టకు చేరి ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని అన్నారు. రాజధాని అమరావతి కోసం రైతులు చేస్తున్న ఉద్యమం 317వ రోజుకు చేరుకుందని దీనిని బట్టి చూస్తుంటేనే ఎవరు నిజాయితీగా నిరసన తెలుపుతున్నారో అర్ధమవుతుందని రామకృష్ణ అన్నారు.