ఏపీ సీఎం జగన్కు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సవాల్ విసిరారు. వ్యవసాయ బిల్లులకు నిరసనగా అనంతపురంలోని బీఎ్సఎన్ఎల్ కార్యాలయం ఎదుట వామపక్షాలు చేపట్టిన ఆందోళనలో పాల్గొన్న నారాయణ మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ బిల్లులతో సన్న చిన్నకారు రైతులు పంటలను ఎక్కడ అమ్ముకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
అయితే మీటర్లు బిగించి చూడు, ఏమవుతుందో అంటూ జగన్కు సవాల్ విసిరారు. తమరు చెప్పినట్లు మీటర్లు పెడతా దొరా! నన్ను మాత్రం జైలుకు పంపొద్దని జగన్ ప్రధానిని వేడుకుంటున్నట్లుగా ఉందని, బాంఛన్ దొరా అనేవిధంగా మీటర్లు పెట్టడానికి జగన్ ప్రయత్నిస్తుండటం సిగ్గుచేటు అని అన్నారు. రాబోయే రోజుల్లో జగన్కు పుట్టగతులు ఉండవని అన్నారు. సంసారం ఉండి పిల్లలున్న వారికైతే రైతుల బాధ తెలుస్తుందని అవేమీ లేని ప్రధాని మోదీకి ఏమి తెలుస్తుందని అన్నారు.