కేటీఆర్‌ని సీఎం చేసి రెస్ట్ తీసుకో.. కేసీఆర్‌కు సీపీఐ నేత నారాయణ సజేషన్..!

Friday, August 21st, 2020, 08:15:43 AM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సీపీఐ నేత నారాయణ ఓ సజేషన్ ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో కేటీఆర్ పాలన నడుస్తోందని, సీఎం కేసీఆర్ ఎక్కువగా ఫామ్‌హౌజ్‌కే పరిమితమవుతున్నారని అన్నారు. అలాంటప్పుడు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసి కేసీఆర్ రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అభిప్రాయపడ్డారు. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల తరువాత కేటీఆర్‌ని ముఖ్యమంత్రి చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతుందని చెప్పుకొచ్చారు.

ఒకవేళ అదే నిజమై పరిపాలన మొత్తం అధికారికంగా కేటీఆర్‌కు అప్పగిస్తే కనుక అతడు సొంత నిర్ణయాలు తీసుకునేందుకు వీలు ఉంటుందని అన్నారు. వరదల కారణంగా దెబ్బతిన్న వరంగల్‌లోని పలు ప్రాంతాల్లో నారాయణ రెండు రోజుల క్రితం కేటీఆర్ వచ్చి 10 కోట్లు కేటాయించారని ఇక్కడ పరిస్థితులు చక్కబడాలంటే కనీసం 1000 కోట్లు అవసరమని అన్నారు. వరదలకు కారణమైన ఆక్రమణలు తొలగించాలని కేటీఆర్ అధికారులకు సూచించారని ఆక్రమణల్లో ఎక్కువగా టీఆర్ఎస్ నాయకులే ఉన్నారని అలాంటప్పుడు అది ఎలా సాధ్యం అవుతుందో చూడాలని అన్నారు.