అందుకోసమే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ – సీపీఐ నారాయణ

Friday, February 12th, 2021, 09:46:54 AM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా ఆగ్రహం జ్వాలలు రేగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తో విశాఖ లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కి నిరసన గా ఉద్యమం ఉదృతం అవుతుంది. విశాఖ లో కూర్మన్న పాలెం వద్ద విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలకు పలువురు మద్దతు ఇస్తున్నారు. ఈ మేరకు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తల్లిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంత ఉందో, విశాఖ ఉక్కు ను కాపాడుకోవాల్సిన బాధ్యత అంతే ఉంది అని అన్నారు. వేలాది ఎకరాల భూములను దోచుకునేందుకే స్టీల్ ప్రైవేటీకరణ చేస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఏ పరిశ్రమ కి అయినా భూములు కేటాయిస్తే వారు అమ్ముకొడానికి వీలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయాలి అంటూ డిమాండ్ చేశారు నారాయణ. అయితే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ లో తీర్మానం చేస్తే సరిపోదు అని, ఈ ఉద్యమాన్ని రాజకీయం గా తీవ్రతరం చేయాలి అంటూ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ముత్తంసెట్టి శ్రీనివాస్ సైతం హాజరు అయ్యారు.