సీపీఐ నేత, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ మృతి..!

Tuesday, October 13th, 2020, 09:12:28 PM IST


సీపీఐ అగ్రనేత, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ నేడు మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం నిమ్స్ ఆసుపత్రిలో మరణించారు. కొద్ది రోజుల క్రితం కిడ్నీ సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. అయితే అనారోగ్య సమస్యలన్ని మెలికేయడంతో నేడి తుదిశ్వాస విడిచారు.

అయితే కార్మిక కుటుంబం నుంచి వచ్చిన గుండా మల్లేష్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. 1983, 1985, 1994 ఎన్నికలలో ఆసిఫాబాద్ నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2009లో బెల్లంపల్లి నుంచి ఎన్నికై సభానాయకుడిగా కూడా వ్యవహరించారు. అయితే అభిమానులు, బంధుమిత్రులు ఆయనకు నివాళి అర్పించేందుకు గానూ ఆయన భౌతిక కాయాన్ని మఖ్దూం భవన్ లో ఉంచనున్నారని సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. కాగా మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు.