డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే పదేళ్లు జైలు.. సీపీ సజ్జనార్ వార్నింగ్..!

Tuesday, December 29th, 2020, 05:44:49 PM IST

డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాహనదారులకు సైబరాబాద్ సీపీ సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. సైబరాబాద్ పరిధిలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, ఏఆర్‌, ఎస్‌వోటీ పోలీసులు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పాల్గొంటున్నారని ఎవరైనా తాగి రోడ్లపై వాహనాలు డ్రైవ్ చేస్తే వదలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు.

అయితే డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే పదేళ్లు జైలు శిక్ష పడుతుందని, మద్యం సేవించి వాహనాలు నడిపేవారు టెర్రరిస్టులతో సమానమని సజ్జనార్ వ్యాఖ్యానించారు. నిన్న ఒక్కరోజే డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 402 మంది పట్టుపడ్డారన్నారు. ఇకపీ తాగి వాహనం నడిపితే ఐపీసీ 304 కింద కేసులు నమోదు, 10 సంవత్సరాలు జైలు శిక్ష పడేలా చూస్తామని అన్నారు.