బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు సీపీ సజ్జనార్ వార్నింగ్..!

Tuesday, December 22nd, 2020, 08:30:39 PM IST

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు సీపీ సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. నేడు సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ రాజాసింగ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. పోలీసుల మీద, డీజీపీ మీద కామెంట్స్ చేయడం ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయిందని సజ్జనార్ వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు పోలీసుల మీద అనవసర ఆరోణలు చేస్తున్నారని, ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని అది మంచి పద్దతి కాదని అన్నారు. రాజాసింగ్ వ్యాఖ్యలపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని అన్నారు. బీజేపీ నేతలు పోలీస్ మొరాలిటీ దెబ్బతీసే విధంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని అన్నారు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే కేసులు ఎదురుకోక తప్పదని హెచ్చరించారు.