అనవసరంగా రోడ్ల మీదకు వస్తే కఠిన చర్యలు తప్పవు – సీపీ సజ్జనార్

Tuesday, April 20th, 2021, 03:27:34 PM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అయితే కరోనా వైరస్ మహమ్మారి ను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి పూట కర్ఫ్యూ విధించడం జరిగింది. రాత్రి 9 గంటల సమయం నుండి ఉదయం 5 గంటల వరకు ఈ కర్ఫ్యూ అమలు కానుంది. మే 1 వ తేదీ వరకు ఈ కర్ఫ్యూ కొనసాగనుంది. అయితే నైట్ కర్ఫ్యూ కి ప్రజలు సహకరించాలి అని సీపీ సజ్జనార్ వ్యాఖ్యానించారు. ప్రజలు స్వచ్ఛందంగా ఇళ్ళల్లోనే ఉండాలి అంటూ చెప్పుకొచ్చారు. అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతి ఇస్తాం అని అన్నారు. నైట్ కర్ఫ్యూ ను కఠినంగా అమలు చేస్తామని అన్నారు. అయితే అనుమతి ఉన్న రంగాల వాళ్ళు ఐడీ చూపాలి అని తెలిపారు. అంతేకాక అనవసరం గా రోడ్ల మీదికి వస్తే చర్యలు తప్పవు అంటూ హెచ్చరికలు జారీ చేశారు.