హాట్ న్యూస్ : భారత్ లో పెరుగుతున్న కరోనా రికవరీ రేటు..ఇప్పటికి ఎన్ని కేసులు తగ్గాయో తెలుసా?

Thursday, July 30th, 2020, 10:36:49 AM IST

మన దేశంలో కరోనా వైరస్ ఏ స్థాయిలో విజృంభిస్తుందో అందరికీ తెలిసిందే. ప్రతీ రోజు రికార్డు స్థాయి కేసులు నమోదు అవుతుండడంతో భారత్ అత్యధిక కరోనా కేసులు సోకిన దేశంగా మారింది. అయితే ఎక్కువగా ఈ కేసుల పెరుగుదల మీద మాత్రమే దృష్టి పెట్టిన వారంతా తరుగుదల రేటు కోసం తక్కువగానే ఆలోచిస్తున్నారు.

ఈ విషయంలో మాత్రం మన దేశం ఒక ఇంత ముందే ఉందట. తాజాగా మన దేశ కుటుంబ ఆరోగ్య శాఖ మంత్రి చెప్పిన దాని ప్రకారం మన దేశంలో కరోనా బారి నుంచి రికవర్ అయిన వారి సంఖ్య మిలియన్ మార్కును టచ్ చేసిందట. ఇది ఒక శుభపరిణామం అని వారు అంటున్నారు.

అలాగే గత నెల మన దేశంలో కరోనా మరణాల రేటు 3.3 శాతం ఉండగా ఇప్పుడు అది 2.3 శాతానికి వచ్చింది అంటే క్రమక్రమంగా మన దేశంలో కరోనా నుంచి కోలుకునే వారి శాతం పెరిగింది అని చెప్పాలి. ఇక ఆ వాక్సిన్ కూడా వచ్చేస్తే ఓ పనైపోతుంది.