జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ…మళ్ళీ 26 కి వాయిదా

Monday, May 17th, 2021, 02:59:49 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు లో బెయిల్ రద్దు చేయాలంటూ అధికార పార్టీ వైసీపీ కి చెందిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీబీఐ కోర్ట్ లో పిటిషన్ వేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే నేడు సీబీఐ కోర్టు లో విచారణ జరిగింది. అయితే దీని పై కౌంటర్ దాఖలు చేయాలని ఇప్పటికే కోర్ట్ సీబీఐ అధికారులను, జగన్ ను కోర్ట్ ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే 7 వ తేదీన విచారణ జరగగా, కొంత సమయం ఇచ్చిన కోర్ట్, మరొకసారి గడువు పెంచింది. సీబీఐ మరియు జగన్ తరపున న్యాయవాదులు సమయం కోరడం తో ఈ నెల 26 వ తేదీకి విచారణ వాయిదా వేయడం జరిగింది. అయితే. జగన్ మోహన్ రెడ్డి సాక్ష్యాలను ప్రభావితం చేస్తున్నారు అంటూ పిటిషన్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆయన బెయిల్ రద్దు చేసి, విచారణ చేపట్టాలి అంటూ పిటిషన్ లో పేర్కొన్న విషయం తెలిసిందే.