అఖిల ప్రియకి కోర్టులో చుక్కెదురు…బెయిల్ పిటిషన్ తిరస్కరణ

Monday, January 11th, 2021, 02:55:01 PM IST

కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయి, ఏ 1 గా ఉన్న అఖిల ప్రియ కోర్టును ఆశ్రయించింది. అయితే ఈ మేరకు సికింద్రాబాద్ కోర్టు లో అఖిల ప్రియ కి చుక్కెదురు అయింది. ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. అయితే ఆమె కి సంబంధించిన మెడికల్ రిపోర్ట్ ను చంచల్ గూడ జైలు అధికారులు కోర్టు కి సమర్పించడం జరిగింది. అయితే మొత్తం నివేదికను పరిశీలించిన అనంతరం కోర్టు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించడం జరిగింది. అయితే పోలీసులు సైతం ఈ కేసు విషయం లో పూర్తి విచారణ జరపాలని చూస్తున్నారు.

కోర్టు పోలీసులకు విచారణ జరిపేందుకు అనుమతి ఇచ్చింది. అంతేకాక 7 రోజుల కస్టడీ కి అనుమతి అడగగా, కోర్టు పోలీసులకి మూడు రోజుల సమయం ఇచ్చింది. అయితే నేటి నుండి అఖిల ప్రియ ను పోలీసులు విచారించనున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన కిడ్నాప్ కేసులో అఖిల ప్రియ బెయిల్ పిటిషన్ తిరస్కరించడం తో ప్రస్తుతం చర్చంశనేయం గా మారింది.