బిగ్ అప్డేట్ : తెలంగాణ లో 45 కి పెరిగిన కరోనా బాదితుల సంఖ్య…

Friday, March 27th, 2020, 07:28:24 AM IST

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ పోతుంది. నిన్నటి వరకు 41 మందికి ఉన్న కరోనా బాధితులు నేటికీ 45 కి చేరుకున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా కేవలం విదేశాల నుండి వచ్చిన వారికి మాత్రమే ఈ కరోనా వైరస్ సోకింది. కానీ తాజాగా ఇక్కడే ఉన్న వారికి కూడా ఈ వైరస్ సోకుతుందని సమాచారం. అంటే ఈ వైరస్ రెండొదశకి చేరుకుందని అర్థమవుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ వైరస్ సోకిన నలుగురు కూడా ఎలాంటి విదేశీ ప్రయాణాలు చేయలేదని, కానీ వీరు ఇటీవల ఢిల్లీ, తిరుపతి వెళ్లొచ్చిన తరువాతే ఈ వైరస్ లక్షణాలు వీరిలో కనిపించాయని సమాచారం.

కాగా తాజాగా ఈ వైరస్ సోకిన నలుగురిని కూడా ఆసుపత్రికి తరలించి ప్రత్యేకమైన ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు. అంతేకాకుండా ఈ నలుగురు ఇది వరకు ఎవరెవరితో సన్నిహితంగా ఉండేవారో వారందరిని కూడా వైద్యాధికారులు పర్యవేక్షిస్తున్నారని సమాచారం. అయితే అయితే తాజాగా ఈ వైరస్ సోకిన నలుగురిలో ఒకరు డాక్టర్ కాగా, మరొకరు ఆయన భార్య, అయితే వీరిద్దరూ కూడా ఇటీవలే తిరుపతికి వెళ్లొచ్చారు. వీరితో పాటే ఇద్దరు మేడ్చల్ ప్రాంతానికి చెందిన వారు. అయితే వీరు ఇటీవలే డిల్లికి వెళ్లొచ్చిన తరువాతే వీరికి భయంకరమైన మహమ్మారి కరోనా వైరస్ నిర్దారణ అయిందని సమాచారం. కానీ వీరి వలన ఇంకెంత మందికి ఈ వైరస్ సోకిందని అధికారులు దర్యాప్తు చేపట్టారు.