బిగ్ అప్డేట్ : డేంజర్ జోన్లోకి భారత్… దారుణంగా పెరుగుతున్న కేసులు…?

Thursday, May 21st, 2020, 02:07:12 PM IST


భారతదేశంలో మహమ్మారి కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకు చాలా దారుణంగా పెరుగుతుంది. దీని నివారణకై ఎన్ని కీలకమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా కరోనా వైరస్ తీవ్రత మాత్రం తగ్గడం లేదని చెప్పాలి. ఇన్నిరోజులు చాలా కఠినంగా ఉన్నటువంటి లాక్ డౌన్ కారణంగా మహమ్మారి కరోనా వైరస్ దశలో నియంత్రణలోకి వచ్చినప్పటికీ కూడా మళ్ళీ కరోనా పాజిటివ్ కేసులు పెరగడంతో ప్రజలందరూ కూడా తీవ్రమైన భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటివరకు దేశంలో పెరుగుతున్న కేసుల ప్రకారం చూసుకుంటే… ప్రపంచంలోనే ముందున్న ఐదు దేశాలలో తాజాగా మన భారతదేశం కూడా చేరిపోయింది.

ఇకపోతే గడిచిన గత 24 గంటల్లో తాజాగా రికార్డు స్థాయిలో 5,609 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ విడుదల చేసిన కోరాని హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.. తాజాగా పెరిగిన కేసులతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,12,359కు చేరింది. ఈ కేసులలో దేశంలో ప్రస్తుతానికి 63,624కేసులు యాక్టివ్‌గా ఉండగా, 48,735 మంది కరోనా నుండి పూర్తిగా కోలుకుని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్‌ అయ్యారని సమాచారం. అంతేకాకుండా ఈ మహమ్మారి భారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,435కు చేరుకుందని కేంద్ర వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.