మొబైల్ ఫోన్ల స్క్రీన్ ల పై 28 రోజుల వరకు కరోనా వైరస్

Tuesday, October 13th, 2020, 11:24:55 PM IST


ఇప్పటికే కరోనా వైరస్ మహమ్మారి తన ప్రభావాన్ని ప్రపంచానికి చూపించింది. అయితే ఇప్పుడు తెలిసిన మరొక విషయం ప్రతి ఒక్కరినీ కూడా విస్మయానికి గురి చేస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి విషయం లో ఎంత అప్రమత్తంగా ఉంటున్నా కూడా ఇంకా కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే అందుం గల కారణాలు ఇవి కూడా అయ్యుండే అవకాశం ఉంది.

మనం రోజూ ఉపయోగించే వస్తువుల ఉపరితలాల పై కరోనా వైరస్ 28 రోజుల పాటు జీవించి ఉంటుంది అని ఆస్ట్రేలియా నేషనల్ సైన్స్ ఏజెన్సీ చేసిన పరిశోధన లో వెల్లడైంది. కరెన్సీ నోట్లు, గ్లాసులు, స్మార్ట్ ఫోన్ స్క్రీన్ లు, స్టెయిన్ లెస్ స్టీల్ వస్తువుల పై ఈ వైరస్ 28 రోజులదాకా జీవించి ఉంటుంది అని తెలిపింది. మనం నిత్యం ఉపయోగించి వస్తువులను సైతం శుభ్రంగా ఉంచుకోవాలి అని పరిశోధకులు సలహాలు ఇస్తున్నారు. ఉష్ణోగ్రత తక్కువగా ఉండే ప్రాంతం లో దీని జీవన కాలం ఎక్కువగా ఉంటుంది అని వారు తెలిపారు. అంతేకాక సున్నితంగా ఉండే ఉపరితలాల్లో కూడా ఎక్కువ రోజులు ఉంటుంది అని తెలిపారు.