తెలంగాణ లో రెండో డోస్ టీకాలు ఎంతమంది కి వేశారంటే?

Thursday, May 13th, 2021, 08:35:57 AM IST

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా నమోదు అవుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మరియు మరణాల తో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే మరొక పక్క వాక్సినేషన్ ప్రక్రియ సైతం రాష్ట్రం లో కొనసాగుతూనే ఉంది. కరోనా వైరస్ వాక్సినేషన్ లో భాగంగా నిన్న ఒక్క రోజే 657 మందికి తొలి డోస్ టీకా వేయగా, 33,438 మందికి రెండవ డోస్ టీకా వేసినట్లు అధికారులు వెల్లడించారు.అయితే తెలంగాణ రాష్ట్రం లో నిన్నటి వరకు కూడా 43,74,351 మందికి తొలి డోస్ టీకా వేయగా, 10,65,362 మందికి రెండో డోస్ టీకా వేసినట్లు తెలిపింది. అంతేకాక ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్రానికి 55,52,360 వాక్సిన్ డోస్ లు రాగా, 54,39,713 డోస్ ల వాక్సిన్ ను ఉపయోగించడం జరిగింది. అయితే వాక్సిన్ కొరత ఉండటం తో రెండవ డోస్ వారికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.