హైదరాబాద్ కి చేరుకున్న కరోనా టీకా..!

Tuesday, January 12th, 2021, 11:49:35 AM IST

దేశం లో కరోనా వైరస్ మహమ్మారి అరికట్టడానికి వైద్యులు, శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేశారు. ఎట్టకేలకు దేశంలో కరోనా వాక్సిన్ అందుబాటులో కి తీసుకు వచ్చారు. అయితే తెలంగాణ రాష్ట్రం కి సైతం ఈ కరోనా వైరస్ వాక్సిన్ వచ్చింది. మంగళవారం నాడు ఉదయం పుణె లోని సీరం ఇన్స్టిట్యూట్ నుండి ట్రక్కుల్లో ఏయిర్ పోర్ట్ కి కరోనా వాక్సిన్ ను తరలించారు. అక్కడి నుండి ప్రత్యేక విమానం లో కరోనా వైరస్ వాక్సిన్ ను శంషాబాద్ విమానాశ్రయానికి తరలించారు. 6.5 లక్షల వాక్సిన్ లు తెలంగాణ రాష్ట్రానికి చేరుకున్నాయి.

అయితే వీటిని శీతలీకరణ కేంద్రాలకు తరలించనున్నారు. ఈ నెల 16 నుండి తెలంగాణ రాష్ట్రం లో వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 1,213 కేంద్రాలు ఈ వాక్సిన్ ప్రక్రియను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు.ఫ్రంట్ వారియర్స్ కి ఈ కరోనా వైరస్ వాక్సిన్ మందుగా వేయనున్నారు. అయితే ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుండి 4 గంటల వరకు ఈ వాక్సిన్ ను వేయనున్నారు.