గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి.. తేల్చి చెప్పిన యూఎస్ సెంటర్ ఫర్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్..!

Thursday, May 27th, 2021, 01:33:28 AM IST

Corona

ఏడాది కాలంగా ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్, సెకండ్ వేవ్‌లలో ఎన్నో వేరియంట్లను మార్చుకుంటూ ఎందరినో బలితీసుకున్న ఈ మహమ్మారి గురుంచి యూఎస్ సెంటర్ ఫర్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఓ షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది. గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందని, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు వెంటిలేషన్ ఏర్పాటుచేసుకోవడమే మంచి మార్గమని చెప్పింది. ఇంటిలోపల గాలి స్వచ్ఛంగా ఉండాలని తెలిపింది.

అయితే తుమ్మడం, దగ్గడం, మాట్లాడటం వంటివి చేసినప్పుడు కరోనా సోకిన వ్యక్తి ముక్కు, గొంతు నుంచి వైరస్ కణాలు బయటకు వ్యాప్తి చెందుతాయని, అందులోని కొన్ని చిన్న కణాలు గాల్లో తేలుతూ ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా గాలి వేగం, తేమ, ఉష్ణోగ్రతను బట్టి ఈ తేలికపాటి కరోనా కణాలు ప్రయాణం చేస్తాయని, ఇవి గాల్లో ఎక్కువ సేపు ఉంటాయని, గదుల్లో మరింత వేగంగా కదులుతాయని పేర్కొన్నారు. ఈ కణాలే ప్రజలకు ప్రమాదకరంగా తయారవుతున్నాయని అంటున్నారు.