బిగ్ న్యూస్: భారత్ లో మళ్లీ పెరిగిన కరోనా రికవరీ రేటు

Thursday, August 13th, 2020, 09:24:34 PM IST

భారత దేశం లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే భారత్ లో కరోనా వైరస్ భారిన పడుతున్న వారు ఎంతమంది ఉన్నారో, అదే రీతిలో కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అవుతున్నారు. అయితే భారత్ లో ప్రస్తుతం కరోనా వైరస్ భారీ నుండి కోలుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం భారత్ లో కరోనా వైరస్ రికవరి రేటు 70.77 శాతానికి చేరింది. అయితే గత కొద్ది రోజుల నుండి రికవరీ రేటు పెరుగుతూ వస్తోంది.

కరోనా వైరస్ మరణాల రేటు కూడా తగ్గుముఖం పట్టింది. దేశంలో కరోనా వైరస్ మరణాల రేటు తగ్గి 1.96 శాతం గా నమోదు అయింది. ప్రస్తుతం భారత్ లో 27.27 శాతం కరోనా వైరస్ కేసులు యాక్టిివ్ గా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 66,999 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 23,96,637 కి చేరింది. అదే విధంగా గడిచిన 24 గంటల్లో 56.383 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకూ 16,95,982 కి చేరింది. ప్రస్తుతం 6,53,622 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.