బిగ్ న్యూస్: భారత్ లో పెరిగిన కరోనా రికవరీ రేటు!

Friday, August 21st, 2020, 09:57:09 PM IST

india_corona

భారత దేశం లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. గత కొద్ది రోజులుగా 60 వేలకు పైగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే తాజాగా గడిచిన 24 గంటల్లో 68,898 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 29,05,823 కి చేరింది. అయితే పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న రికవరీ రేటు కూడా భారీగా పెరుగుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో 62,282 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

అయితే ఇంత పెద్ద మొత్తం లో కరోనా వైరస్ నుండి కోలుకోవడం కాస్త ఊరట కలిగించే అంశం అని చెప్పాలి. భారత్ లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నా, రికవరీ రేటు పెరగడం తో కాస్త ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని కొందరు భావిస్తున్నారు. భారత్ లో ప్రస్తుతం 74.30 శాతానికి కరోనా రికవరీ రేటు చేరగా, మరణాల రేటు 1.9 శాతంగా ఉంది.

భారత్ లో ప్రస్తుతం 6,92,028 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. మెరుగైన వైద్య చికిత్స, జాగ్రత్త చర్యలతో కరోనా వైరస్ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.