బిగ్ న్యూస్: భారత్ లో మళ్లీ పెరిగిన కరోనా రికవరీ రేటు…ఎంతంటే?

Tuesday, August 18th, 2020, 02:03:54 AM IST


భారత్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. పాజిటివ్ కేసులు, కరోనా వైరస్ భారిన పడిన వారు కూడా ఎక్కువగానే మృతి చెందుతున్నారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న దేశాల్లో భారత్ మూడవ స్థానం లో కొనసాగుతూ ఉండగా, మరణాల్లో మాత్రం నాల్గవ స్థానం లో కొనసాగుతూ ఉంది.భారత్ లో ఇప్పటి వరకు 50 వేలకు పైగా కరోనా వైరస్ భారిన పడి ప్రాణాలను కోల్పోయారు.

అయితే కరోనా వైరస్ మరణాలు 50 వేలకు చేరడానికి 156 రోజుల సమయం పట్టగా, అమెరికా, బ్రెజిల్ లాంటి కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశాల్లో అతి తక్కువ రోజుల్లోనే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయి. ప్రస్తుతం భారత్ లో కరోనా వైరస్ మరణాల రేటు 1.9 శాతం గా ఉంది. భారత్ లో రికవరీ రేటు పెరుగుతూ వస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్నా, రికవరీ రేటు పెరుగుతూ వస్తోంది. ఇది భారీ ఊరట కలిగించే అంశం అని చెప్పాలి. ప్రస్తుతం దేశం లో కరోనా వైరస్ బాధితుల రికవరీ రేటు 72.5 శాతంగా ఉంది. అయితే ఇది కాస్త ఇంకా మెరుగు అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.