తెలంగాణ లో పెరుగుతున్న కరోనా బాధితులు – మూడేళ్ళ బాలుడికి కరోనా పాజిటివ్

Thursday, March 26th, 2020, 08:12:43 AM IST

తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతూ పోతుంది. అయితే నిన్న సాయంత్రం వరకు తెలంగాణలోమరొక రెండు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి… దానికి తోడు వారిలో ఒక మూడేళ్ళ బాలుడికి కరోనా పాజిటివ్ వచ్చిందని రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. దేన్తి తెలంగాణ రాష్ట్రములో కరోనా బాధితుల సంఖ్య 41 కి చేరింది. వివరాల్లోకి వెళ్తే ఆ బాలుడి సభ్యులు హైదరాబాద్ ప్రాంతంలో నివాసం ఉంటారు. కాగా ఇటీవల వారి కుటుంబం సౌదీ అరేబియా నుంచి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కాగా ఆ బాలుడికి ఇటీవల దగ్గు జలుబు ఎక్కువవడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. ఈ మేరకు ఆ బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది.

వారితో పాటే రంగారెడ్డి జిల్లా కోకాపేటకు చెందిన ఓ వ్యక్తి ఇటీవల లండన్ నుంచి వచ్చాడు. కాగా ఆ వ్యక్తితో పాటే అతడి భార్య కి కూడా ఈ కరోనా వైరస్ సోకిందని సమాచారం. ఈమేరకు రాష్ట్రములో కరోనా వైరస్ రెండవ దశలోకి ప్రవేశించిందని అర్థమవుతుంది. అందుకనే ఇక్కడి వారిలో ఈ వైరస్ ఒకరి నుండి మరొకరికి ఈ భయంకరమైన కరోనా వైరస్ వ్యాపిస్తుంది. కాగా ఈ కరోనా బాధితులందరికీ కూడా హైదరాబాద్ లోని ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో లాక్ డౌన్ పై మరింత కఠిన చర్యలు తీసుకోనున్నారు ప్రభుత్వాధికారులు…