ఏపీ లో స్కూళ్లు మరియు కాలేజీ ల పునః ప్రారంభం తో కరోనా కేసులు పెరుగుదల?

Wednesday, November 4th, 2020, 12:03:28 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. అయితే ఇటీవల పాటశాలలు మరియు కళాశాలలు పునః ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ప్రత్యేక కరోనా వైరస్ నిబంధనలు పాటిస్తూ వీటిని పునః ప్రారంబించడం జరిగింది. అయితే ప్రకాశం జిల్లాలో కొన్ని కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి. స్కూళ్లు, కాలేజీలు పునః ప్రారంభం కావడం తో ఇవి నమోదు అవుతున్నట్లు తెలుస్తోంది.

అయితే జిల్లా వ్యాప్తంగా నాలుగు జెడ్పీ హై స్కూళ్ళలో ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కరోనా వైరస్ సోకడం జరిగింది. అయితే ఈ కేసుల నమోదు కారణంగా మరోమారు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన కి గురి చెందాల్సి వస్తుంది. మరో పక్క విద్యా శాఖ ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత పూర్తి స్థాయిలో తగ్గకపోయినప్పటికీ ఇలా పునః ప్రారంభం చేయడం పట్ల పలువురు విమర్శలు చేస్తున్నారు.