భారత్ లో తగ్గిన కరోనా మరణాల రేటు…ఎంతంటే?

Thursday, August 6th, 2020, 01:06:50 AM IST

Corona
కరోనా వైరస్ మహమ్మారి భారత్ లో వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఊహించని రీతిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఒక పక్క వేల సంఖ్యలో పెరుగుతున్నా, రికవరీ కూడా అదే స్థాయిలో ఉండటం గమనార్హం. గత 14 రోజుల నుండి కరోనా వైరస్ నుండి కోలుకొని డిశ్చార్జ్ అవుతున్న వారి రేటు 63 శాతం నుండి 67 శాతానికి పెరిగింది. అయితే మరణాల రేటు 2.09 గా కొనసాగుతుంది. రోజురోజుకీ ఇది తగ్గిపోతోంది.

కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు ఎక్కువగా నిర్వహించడం, వైద్య విధానాలు మెరుగ్గా ఉండటం తో ఈ మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ యాక్టివ్ గా ఉన్న కేసుల రేటు దేశ వ్యాప్తంగా 30.72 శాతం గా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకూ 2,14,84,402 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించిన విషయాన్ని ఐసీఎంఅర్ వెల్లడించింది. అయితే కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే ఈ గణాంకాలు ఇంకాస్త మెరుగు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.