ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా మృతుల సంఖ్య!

Friday, May 22nd, 2020, 09:50:17 PM IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వేల సంఖ్యలో బాధితులు మరణిస్తున్నారు. ఈ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. అయితే రోజు రోజుకి కరోనా వైరస్ కారణంగా చనిపోతున్న వారి సంఖ్య గణీయంగా పెరుగుతూ ఉంది. అయితే ఇప్పటివరకు దీనికి వాక్సిన్ ఇంకా లేకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే జాన్స్ హాప్ కిన్స్ కోవిద్ 19 వెబ్సైట్ కరోనా వైరస్ కి సంబందించిన వివరాలు సేకరించి అందులో పొందు పరుస్తోంది. అయితే శుక్రవారం మధ్యాహ్నం నాటికి ఈ వైరస్ భారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 3,33, 383 గా ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పటికే అన్ని దేశాలు లాక్ డౌన్ సడలింపు చర్యలు తీసుకున్నారు. దీని కారణంగా కొత్తగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.అయితే కరోనా వైరస్ మృతుల విషయం లో అమెరికా ఇంకా టాప్ లో కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు అమెరికా లో కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 94,729 మంది మరణించారు. ఎక్కువగా పాజిటివ్ కేసులు కూడా ఈ దేశంలోనే నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకూ అమెరికా లో 1,577,758 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆ తర్వత స్థానంలో బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, బ్రెజిల్, బెల్జియం లు ఉన్నాయి.