భారత్‌లో 36 లక్షలు దాటిన కరోనా కేసులు.. నేడు కూడా రికార్డ్ స్థాయిలో..!

Monday, August 31st, 2020, 12:16:22 PM IST

india_corona

భారత్‌లో కరోనా కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. గత కొద్ది రోజులుగా రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుంటే, అదే స్థాయిలో మరణాలు కూడా నమోదవుతున్నాయి. అయితే గడిచిన 24 గంటల్లో కూడా రికార్డ్ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొత్తగా 78,512 పాజిటివ్ కేసులు నమోదు కాగా దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 36,21,245 కి చేరింది.

అయితే ప్రస్తుతం అందులో 7,81,975 యాక్టివ్ కేసులు ఉండగా, 27,74,801 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో కరోనాతో 971 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 64,469 కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 8,46,275 కరోనా టెస్టులు చేశారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 76.06 శాతం ఉండగా, మరణాల రేటు 1.8 శాతంగా ఉంది.