ఈ నెల 31 వరకు ఏపీ లో కరోనా అవగాహన కార్యక్రమాలు!

Wednesday, October 21st, 2020, 02:39:17 PM IST

Corona

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ మరణాలు సైతం నమోదు అవుతునే ఉన్నాయి. అయితే ప్రజల్లో కరోనా వైరస్ పై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దం అయింది. అయితే ఏపీ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గించడం లో విజయం సాధించాం అని, కరోనా తో మృతి చెందేవారీ సంఖ్య బాగా తగ్గింది అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పేర్కొన్నారు.

ఈ మేరకు బుధవారం నాడు కరోనా వైరస్ ను అరికట్టేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. అయితే ఈ నెల 31 వరకు ఈ అవగాహన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. అయితే కరోనా అన్ లాక్ ప్రక్రియతో వ్యవస్థలు అన్నీ కూడా పునరుద్ధరించడం జరిగింది అని, కరోనా వైరస్ జాగ్రత్త చర్యలు ప్రజలు తప్పక పాటించాలి అని సూచించారు. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులకు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలను చేపట్టినట్లు తెలుస్తోంది.