కరోనా బాధితుడి ప్రాణాలు కాపాడిన ఫేస్‌బుక్ పోస్ట్.. ఎలా అంటే..!

Thursday, July 9th, 2020, 12:50:30 PM IST

సోషల్ మీడియా.. ఏదైనా మంచి విషయం కావచ్చు, చెడు విషయం కావచ్చు క్షణాలలో అందరికి చేరిపోతుంది. అయితే ఇదే సోషల్ మీడియా ఆపదలో ఉన్న ఓ వ్యక్తి ప్రాణాలు నిలిపింది.

హైదరాబాద్ కృష్ణానగర్‌లో ఉంటున్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందని, శ్వాస ఆడట్లేదని, కాపాడండి ప్లీజ్ అంటూ అర్ధరాత్రి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. అయితే ఆ పోస్టును ప్రభుత్వానికి, అధికారులకు తెలిసేలా నెటిజన్లు ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీనికి స్పందించిన తెలంగాణ ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ బాధితుడి ఇంటికి అంబులెన్స్ పంపించారు. ప్రస్తుతం అతను గాంధీలో చికిత్స తీసుకుంటున్నాడు.