ఏపీ లో ఏప్రిల్ 1 నుండి 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కరోనా టీకా!

Wednesday, March 31st, 2021, 09:35:02 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. కరోనా వైరస్ మహమ్మారి ను కట్టడి చేయడం కో వాక్సిన్ దే కీలక పాత్ర అని నిపుణులు నమ్ముతున్నారు. అయితే ఈ మేరకు కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్ కూడా ఉండటం గమనార్హం. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వాక్సిన్ ప్రక్రియ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. కాగా, ఏప్రిల్ 1 వ తేదీ నుండి 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ కూడా వాక్సిన్ ఇవ్వబడుతుంది. అయితే వాక్సిన్ వేయించుకొవడం కొరకు cowin.gov.in లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే టీకా తీసుకోవడం ద్వారా సురక్షితంగా ఉండటానికి అవకాశం ఉంటుంది అని నిపుణులు అంటున్నారు.దీని పై ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.