దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సిద్దమైన కేంద్రం.. ఎప్పటినుంచి అంటే?

Tuesday, January 5th, 2021, 07:30:47 PM IST

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్ని రకాల ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే కేంద్రం కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లను అత్యవసర వినియోగంగా వాడేందుకు అనుమతులు ఇచ్చింది. అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ముందస్తుగానే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కేంద్రం డ్రైరన్ కూడా నిర్వహించింది.

అయితే కేంద్రం చేపట్టిన ఈ డ్రైరన్ కూడా విజయవంతం కావడంతో తాజాగా కరోనా వ్యాక్సిన్ ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారన్న దానిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఈ నెల 13 నుంచి తొలి కరోనా వ్యాక్సిన్ డోసు ఇచ్చే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో నాలుగు ప్రధాన వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని కర్నాల్, ముంబై, చెన్నై, కోల్‌కత్తా ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది.