తెలంగాణలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీపై యాక్షన్‌ ప్లాన్ షురూ..!

Monday, December 14th, 2020, 07:26:20 PM IST

తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి యాక్షన్‌ ప్లాన్‌ షురూ అయ్యింది. జనవరి రెండో వారంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్న నేపధ్యంలో వ్యాక్సిన్ స్టోరేజ్, పంపిణీపై కేంద్రం గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. తొలుత హెల్త్ వర్కర్లకు తర్వాత ఫ్రంట్ లైన్ వర్కర్లకు, ఆ తర్వాత 50 ఏళ్ళు పైబడిన వారికి మరియు ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.

అయితే తెలంగాణలో కూడా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రంగం చేసుకుంది. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అధికారులతో నేడు కమిటీ ఏర్పాటు చేశారు. వ్యాక్సిన్‌ పంపిణీపై రెండ్రోజుల పాటు అధికారులకు వర్చువల్‌ శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణలో రాష్ట్ర హెల్త్‌ డైరెక్టర్ శ్రీనివాస్‌రావుతో పాటు 33 జిల్లాల డీఎంహెచ్‌వోలు పాల్గొన్నారు. వ్యాక్సినేషన్‌ ప్రణాళిక, స్టోరేజ్ తదితర విషయాలపై శిక్షణనిస్తున్నారు. టీకా తీసుకున్న తర్వాత పర్యవేక్షణ, ప్రజలల్లో ఆందోళనలు తగ్గించడం, వ్యాక్సిన్‌ తీసుకోవడంపై ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి అంశాలపై దృష్టి సారించనున్నట్టు తెలుస్తుంది.