కరోనా టెస్టుల కోసం భారీ క్యూ లైన్.. వీడియో వైరల్..!

Monday, June 29th, 2020, 08:32:18 PM IST

తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు దాదాపుగా వెయ్యి కొత్త కేసులు నమోదవుతున్న నేపధ్యంలో ప్రజలలో తీవ్ర భయాందోళన నెలకొంది. అయితే లక్షణాలు కాస్త కనిపించినా మాకు కరోనా సోకిందేమోనని అనుమానపడుతున్నారు.

అయితే ముందు జాగ్రత్తగా టెస్టులు చేయించుకోవడం మంచిదని ప్రైవేట్ ల్యాబ్స్ ముందు జనం భారీగా క్యూ కడుతున్నారు. సికింద్రాబాద్, తిరుమలగిరిలో విజయా డయాగ్నోస్టిక్స్ ముందు టెస్టుల కోసం భారీగా క్యూ కట్టారు. అయితే టెస్టుల కోసం జనాలు క్యూ కడుతుండడంతో టోకెన్లు ఇచ్చి మరీ శాంపిల్స్ సేకరిస్తున్నారు. టోకెన్ తీసుకున్న వారం తర్వాత టెస్టులకు పిలుస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ క్యూ లైన్ వీడియో వైరల్ అవుతుంది.