గాలి ద్వారా కరోనా ఇలా కూడా వ్యాప్తి చెందుతుందా!?

Thursday, October 29th, 2020, 05:26:01 PM IST

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను భయ భ్రంటులకు గురి చేస్తోంది. అయితే ఇది గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది అంటూ పలువురు శాస్త్ర వేత్తలు ఇప్పటికే ఆధారాలతో నిరూపించారు. అయితే ఇండోర్ ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది అని తెలుస్తోంది. అయితే ఏరో సోల్స్ ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు అని పలువురు అంటున్నారు. గట్టిగా అరుస్తూ మాట్లాడటం, వెంటి లేషన్ లేని గదిలో మాస్క్ లు ధరించకుండా ఉండటం, సామాజిక దూరం పాటించక పోవడం మూలాన కరోనా వైరస్ భారిన పడే అవకాశం ఉంది.

ఫేస్ మాస్క్ లు దరించి, వెంటి లేషన్ ఉన్న ప్రదేశాలలో ఉండటం వలన కరోనా వైరస్ భారీ నుండి తప్పించుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. దగ్గడం, తుమ్మడం ద్వారా పెద్ద బిందువులు వాహకాలు గా మారి కరోనా వైరస్ వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉంటుంది. పెద్ద గొంతు తో మాట్లాడినప్పుడు కంటే, మాట్లాడకుండా ఉన్నపుడు 50 శాతం తక్కువగా ప్రమాదం ఉండే అవకాశం ఉంది. 5 మీటర్ల కంటే తక్కువ దూరం లో ఫేస్ మాస్క్ లేకుండా కలిసి ఉండటం మూలాన ఎక్కువగా కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది.