దేశ రాజధాని లో పెరుగుతున్న కరోనా రికవరీ రేటు

Thursday, September 24th, 2020, 02:01:31 AM IST

Corona
దేశ రాజధాని ఢిల్లీ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మహమ్మారి తన ఉగ్ర రూపం దాల్చడం తో భారీగా ప్రాణాలను కోల్పోతున్నారు. గడిచిన 24 గంటల్లో 3,714 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు అక్కడ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 2,56,789 కి చేరింది. ఈ కేసుల సంఖ్య మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే అదే తరహాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ఢిల్లీ లో 36 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ ప్రాణాలను కోల్పోయారు. తాజాగా నమోదు అయిన ఈ కరోనా వైరస్ మరణాలతో మొత్తం ఢిల్లీ లో మృతి చెందిన వారి సంఖ్య 5,087 కి చేరింది. అయితే కరోనా వైరస్ రికవరీ రేటు కాస్త మెరుగ్గా ఉందని చెప్పాలి. గడిచిన 24 గంటల్లో 4,465 మంది కరోనా వైరస్ భారీ నుండి కొలుకోగా, ఇప్పటి వరకు కరోనా వైరస్ నుండి కోలుకున్న వారి సంఖ్య 2,20,866 కి చేరింది. ప్రస్తుతం ఢిల్లీ లో 30,836 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు యాక్టిివ్ గా ఉన్నాయి.