గుడ్‌న్యూస్: భారత్‌లో పెరుగుతున్న కరోనా రికవరీ రేటు..!

Monday, August 24th, 2020, 11:18:31 AM IST

భారత్‌లో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నా, రికవరీ రేటు కూడా అంతకంతకు పెరుగుతూనే ఉంది. అయితే దేశంలో గడిచిన 24 గంటల్లో 61,408 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 31,06,348 కి చేరింది.

అయితే ప్రస్తుతం అందులో 7,10,771 యాక్టివ్ కేసులు ఉండగా, 23,38,035 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో కరోనాతో 836 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 57,542 కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 6,09,917 కరోనా టెస్టులు చేశారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 75.03 శాతం ఉండగా, మరణాల రేటు 1.9 శాతంగా ఉంది.