తెలంగాణ అసెంబ్లీలో కరోనా కలకలం.. రెండు రోజులకే..!

Tuesday, September 8th, 2020, 08:30:46 PM IST

తెలంగాణలో ఓ పక్క కరోనా కేసులు పెరుగుతుంటే మరో పక్క అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడీగా జరుగుతున్నాయి. అయితే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే నేతలు ఖచ్చితంగా కరోనా పరీక్షలు చేయించుకుని నెగిటివ్ రిపోర్ట్ చూపిస్తేనే అనుమతించేలా ఆదేశాలు ఇచ్చారు.

అయితే ఇదంతా బాగానే ఉన్నా అసెంబ్లీ సమావేశాలు మొదలైన రెండు రోజులకే అసెంబ్లీలో కరోనా కలకలం రేపుతుంది. అసెంబ్లీలో పాసులు జారీ చేసే ఉద్యోగికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. సిబ్బందికి ఆ అసెంబ్లీ ఉద్యోగి వందల సంఖ్యలో పాసులు జారీ చేసినట్లు తెలిసింది. అయితే నెగిటివ్ రిపోర్టు ఉంటేనే అనుమతిస్తామని అధికారులు చెబుతున్నా కానీ అసెంబ్లీ భద్రతా సిబ్బంది మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తుంది.