ఏపీలో దారుణం.. ఆస్పత్రి పైనుంచి దూకి కరోనా రోగి ఆత్మహత్య..!

Saturday, August 29th, 2020, 07:05:50 PM IST

ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. అయితే కరోనా సోకినా మనోధైర్యంతో ఎదురుకోవాలని చెబుతున్నా కొందరు మాత్రం కరోనా ఉందని నిర్ధారణ కాగానే తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఇలాంటి తరుణంలో కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు.

అయితే తాజాగా ఓ కరోనా రోగి ఆసుపత్రి భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కోవిడ్ లెవెల్ 1 ఆశ్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగి ఆసుపత్రి మూడోప్లోర్ కిటికీ నుంచి దూకి ఆత్మహత్యకి పాల్పడ్డాడు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలుకి చెందిన కోలా రాంబాబు ఈ నెల 17 వతేదీ నుండి కరోనా పాజిటీవ్ రావడంతో చికిత్స కోసం వచ్చాడు. అయితే గత మూడురోజులుగా నేను దేవుడు దగ్గరకి వెళిపోతా అంటూ గట్టి గట్టిగా అరుస్తున్నాడని, ఈ రోజు తెల్లవారుజామున బై బై నేను దేవుడి దగ్గరకు వెళిపోతున్నా అంటూ అరుస్తూ కిటికీలోనుండి దూకేశాడని ఆస్పత్రిలోని వారు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.