గుంటూర్‌లో విచారకర ఘటన.. రిక్షాపై కరోనా మృతదేహం తరలింపు..!

Thursday, August 13th, 2020, 09:00:14 AM IST

ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో కరోనాతో చనిపోయిన వారి పట్ల కనీస మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు. కరోనాతో చనిపోయిన వారి అంత్యక్రియలు గౌరవప్రదంగా నిర్వహించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించిన క్షేత్ర స్థాయిలో మాత్రం అది కనిపించడంలేదు.

తాజాగా గుంటూరు జిల్లాలో కరోనాతో చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని రిక్షాలో తరలించడం వివాదంగా మారింది. బాపట్లలో కోవిడ్ ఆసుపత్రిలో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ, కనీసం ప్యాక్ చేయాల్సి ఉన్నా పట్టించుకోలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా మృతదేహాన్ని రిక్షాలో తీసుకెళ్తున్న ఫోటోలు వైరల్ కావడంతో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అధికారులకు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు.