బిగ్ న్యూస్ : కరోనాలోనే కొత్త రకం.. షాకిచ్చిన శాస్త్రవేత్తలు..!

Saturday, July 4th, 2020, 11:45:35 AM IST

ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రమాదకారి కరోనా వైరస్ తో మానవాళి పోరాడుతుంది. దాదాపు ఎనిమిది నెలల పాటు ప్రపంచంలో కరోనా బ్యాటింగ్ కొనసాగుతూనే ఉంది. దీనికి ఇంకా వాక్సిన్ కనుక్కునే ప్రాసెస్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వైరస్ మరింత ప్రమాదకరిగా మారిపోతు కలకలం సృష్టిస్తుంది.

ఇదిలా ఉండగా కరోనా వైరస్ నుంచే కొత్త రకం ఒకటి వచ్చిందని శాస్త్రవేత్తలు నిర్ధారించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు విజృంభిస్తున్న కరోనా వైరస్ లో జన్యు క్రమం మార్పిడి మూలాన ఇది కొత్త రకంగా మారింది అని తెలిపారు. ఈ రకానికి జి614 అనే పేరు పెట్టినట్టు తెలుస్తుంది. అలాగే ఈ వైరస్ అత్యంత ప్రమాదకారి అని తెలుపుతున్నారు.

అంతే కాకుండా మానవాళికి కూడా ఈ రకమే త్వరగా సంక్రమించే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి స్పైక్ ప్రోటీన్(కొమ్ము వంటి నిర్మాణం) ఉందని దీని ద్వారా మానవులు శరీరంలోకి ఈ వైరస్ ప్రవేశిస్తుంది అని శాస్త్రవేత్తలు తెలిపారు.