హయత్‌నగర్‌లో కరోనా కలకలం.. 37 మంది విద్యార్థులకు పాజిటివ్..!

Sunday, March 21st, 2021, 01:30:57 AM IST

తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుంది. ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీలలో అనేక మంది విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు. అయితే తాజాగా రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లోని సోషల్ వెల్ఫేర్ గురుకుల జూనియర్ కాలేజీ హాస్టల్‌లో 37 మంది విద్యార్థులు, నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే హాస్టల్‌లో మొత్తం 400కి పైగా విద్యార్థులున్నట్టు సమాచారం.

దీంతో మిగతావారిని అధికారులు అప్రమత్తం చేశారు. కరోనా సోకిన వారిని ఐసోలేషన్ సెంటర్లకు పంపించినట్టు తెలుస్తుంది. అయితే విద్యార్థులకు కరోనా పాజిటివ్ రావడం పట్ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు తిరిగి ప్రారంభమైన తర్వాత కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి.